
Omar Abdullah: పహల్గామ్ ఘటనపై అసెంబ్లీ వేదికగా ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆసక్తికరమైన ప్రసంగం ఇవ్వడంతో, పహల్గామ్ ఉగ్ర దాడి తరువాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు పరిణమించిందని ఆయన చెప్పారు.
'ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర వరకు దేశంలోని ప్రతి ప్రాంతం దిగ్భ్రాంతికి గురైందని ఒమర్ గుర్తుచేశారు.
ఈ దాడి తర్వాత కాశ్మీర్ అంతా ఐక్యంగా ఉందని, లోయలో ఉగ్రవాదం ముగియబోతోందని ఆయన పేర్కొన్నారు. ఉగ్ర దాడిలో మరణించిన 26 మంది పర్యాటకుల పేర్లను సభలో చదివి వినిపించారు.
'ఈ దాడిలో తండ్రులను కోల్పోయిన పిల్లలకు, భర్తలను కోల్పోయిన వితంతువులకు ఏం సమాధానం చెప్పాలి?' అని ఆయన ప్రశ్నించారు.
Details
భద్రతను కల్పించకపోయాం
'ప్రభుత్వం పర్యాటకులను ఆహ్వానించింది, కానీ వారికి సురక్షితమైన భద్రతను కల్పించలేకపోయామని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. 'క్షమాపణ చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు.
మరణించిన వారి కుటుంబ సభ్యులు మాకు ఏం తప్పు చేశామో అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు, ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ, ప్రభుత్వ చర్యలను ప్రశంసిస్తూ, ఉగ్రవాద దాడిని ఖండించారు.
అలాగే, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అఖిలపక్ష సమావేశాన్ని పిలిచినందుకు, అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీం రాథర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రశంసలు అందుకున్నారు.