Page Loader
Chhattisgarh Election: ఛత్తీస్‌గఢ్‌లోపేలుడు.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు 
Chhattisgarh Election: ఛత్తీస్‌గఢ్‌లోపేలుడు.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు

Chhattisgarh Election: ఛత్తీస్‌గఢ్‌లోపేలుడు.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 07, 2023
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మంగళవారం రాష్ట్రంలో పోలింగ్ ప్రారంభమైన వెంటనే నక్సల్స్ పెట్టిన ఐఈడీ పేలడం వల్ల ఎన్నికల విధుల్లో ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్ గాయపడ్డారు. సుక్మా సీనియర్ పోలీసు అధికారి కిరణ్ చవాన్ మాట్లాడుతూ, గాయపడిన జవాన్ శ్రీకాంత్‌ కోబ్రా బెటాలియన్‌కు చెందినవాడని,ఎన్నికల విధుల్లో ఉన్నాడని తెలిపారు. శ్రీకాంత్ కి ప్రథమ చికిత్స అందించామని అతడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. కోబ్రా 206, CRPF సిబ్బంది క్యాంప్ తొండమార్కా నుండి ఏరియా డామినేషన్ ఆపరేషన్‌లో ఎల్మగుండ గ్రామానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. పెట్రోలింగ్‌లో నక్సల్స్ అమర్చిన ఐఈడీపై జవాన్ కాలు మోపడంతో కాలికి గాయమైంది. రెండు రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు సంభవించడం ఇది రెండోసారి.

Details 

ఛత్తీస్‌గఢ్‌లో ఈరోజు తొలి దశ పోలింగ్‌ 

సోమవారం, కాంకేర్‌లో ప్రెజర్ ఐఈడీ పేలుడులో బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్,ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులు గాయపడ్డారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ప్రకాష్ చంద్‌గా గుర్తించారు. అతని కాళ్ళకు గాయాలు అవ్వడంతో చికిత్స నిమ్మితం ఛోటేపెథియాకు తరలించారు. కాగా, ఐఈడీ పేలుడులో పోలింగ్‌ అధికారులిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ప్రభావితమైన బస్తర్‌ డివిజన్‌తో సహా 20 నియోజకవర్గాల్లో ఈరోజు తొలి దశ పోలింగ్‌ జరుగుతోంది. పోలింగ్ సజావుగా సాగేందుకు, 20 నియోజకవర్గాల్లోని సున్నిత ప్రాంతాల్లోని 600కు పైగా పోలింగ్ బూత్‌లకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి రెండో దశ పోలింగ్ నవంబర్ 17న జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.