అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము నివాళి
మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజం, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌పేయి 5వ వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నివాళులర్పించారు. సదైవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద మోదీ పుష్పగుచ్ఛాన్ని ఆయన్ను స్మరించుకున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఎన్డీయే నేతలు వాజ్‌పేయి చిత్రపటానికి అంజలి ఘటించారు. వాజ్‌పేయి నాయకత్వం వల్ల భారతదేశం ఎంతో ప్రయోజనం పొందిందని ప్రధాని మోదీ అన్నారు. విభిన్న రంగాల్లో దేశాన్ని పురగమింపజేసి, 21వ శతాబ్దానికి తీసుకెళ్లడంలో వాజ్‌పేయి కృషి ఎనలేదని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. 1924లో గ్వాలియర్‌లో వాజ్‌పేయి జన్మించారు. 2018 ఆగస్టు 16న మరణించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్‌పేయికు భారతరత్న ప్రకటించింది.