Page Loader
Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి 
ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి

Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Jul 11, 2023
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దిల్లీ -మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. దిల్లీ నుంచి సీఎన్‌జీ నింపుకొని రాంగ్ రూట్లో వస్తున్న స్కూల్ బస్సు ఎస్‌యూవీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఎస్‌యూవీలో ఉన్న 8మందిలో ఆరుగురు చనిపోయారు. ఇద్దిరికి గాయాలయ్యాయి. ఎస్‌యూవీ కారులో ఉన్న వ్యక్తులు మీరట్ నుంచి వస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాంగ్ రూట్లో వస్తున్న బస్సు డ్రైవర్‌దే పూర్తిస్థాయిలో తప్పు ఉందని అడిషినల్ సీపీ(ట్రాఫిక్) రామానంద్ కుష్వాహా తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎస్‌యూవీని స్కూల్ బస్సు ఢీకొన్న దృశ్యాలు