
దిల్లీలో విద్యుదాఘాతానికి మరొకరు బలి
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని రైల్వే స్టేషన్ సమీపంలో 34ఏళ్ల సాక్షి అహుజా విద్యుదాఘాతంతో మరణించిన ఘటన మరువక ముందే, మరో బాలుడు కరెంట్ షాక్ గురై చనిపోయాడు.
జూన్ 25న న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న తైమూర్ నగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 17ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
భారీ వర్షాల కారణంగా వీధి అంతా నీటితో నిండిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో జరిగిన లోపం వల్ల ఆ బాలుడు కరెంట్ షాక్‌కు గురై ఉండొచ్చని అధికారులు ప్రాథమిక విచారణకు వచ్చారు.
అయితే కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీలో పెరుగుతున్న విద్యుత్ షాక్ మరణాలు
Delhi | A 17-year-old boy died due to an electric shock in Taimoor Nagar on 25th June. Police officials on visiting the spot found that there was water accumulated in the street after rain and the boy died due to an electric shock
— ANI (@ANI) June 27, 2023