LOADING...
ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం 
ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం

ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం 

వ్రాసిన వారు Stalin
Sep 20, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో అనూహ్య ఘటన జరిగింది. విమానంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు. డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని మణికందన్‌గా గుర్తించారు. చెన్నై విమానాశ్రయానికి విమానం చేరుకోగానే మణికందన్‌ను ఇండిగో సెక్యురిటీ సిబ్బంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించారు. అయితే మణికందన్ ఎందుకు డోర్ తెరిచాడనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ మేరకు మణికందన్‌పై ఇండిగో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సీఐఎస్ఎఫ్ అదుపులో నిందితుడు