One Nation One Election: జమిలికి కోవింద్ కమిటీ 10 కీలక సూచనలు
దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన సిఫార్సులను మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన సూచనలకు కేంద్రం ఆమోదం తెలుపడంతో, ఈ విషయంలో ముందడుగు వేసినట్లయింది. గతంలో జమిలి ఎన్నికల నివేదికను రాష్ట్రపతికి సమర్పించడంతో, బుధవారం కేంద్ర క్యాబినెట్ వాటిని ఆమోదించింది. ఈ నేపథ్యంలో, నివేదికలో పేర్కొన్న 10 ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం..
కమిటీ రిపోర్టులో 10 కీలకాంశాలు ఇవే ..
- జమిలి ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రత్యేక న్యాయ రక్షణ మెకానిజాన్ని ఏర్పాటు చేయాలి. - మొదటి దశలో లోక్ సభ, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలి. రెండో దశలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలి. ఈ మొత్తం ప్రక్రియ 100 రోజుల్లో పూర్తి కావాలి. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లో ఈ ఎన్నికలు పూర్తి చేయాలి. - ఏకకాల ఎన్నికలకు లోక్ సభ మొదటి సారిగా సమావేశమైన తేదిని అపాయింటెడ్ డేగా రాష్ట్రపతి గుర్తించాలి. అపాయింటెడ్ డే ఆధారంగా అసెంబ్లీల పదవీ కాలాన్ని గుర్తించాలి. - హంగ్ సభలు ఏర్పడినప్పుడు లేదా అవిశ్వాస తీర్మానాల సందర్భంలో లోక్ సభకు తాజా ఎన్నికలు నిర్వహించాలి.
కమిటీ రిపోర్టులో 10 కీలకాంశాలు ఇవే ..
- లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, ఐదేళ్లలో మిగిలిపోయిన కాలానికి మాత్రమే ఆ సభ కొనసాగించాలి. - ఒకవేళ అసెంబ్లీలు రద్దు అయినప్పటికీ, లోక్ సభ పదవీ కాలంతో పాటు మిగిలిన కాలానికే ఆ సభ కొనసాగాలి. -రాష్ట్ర ఎన్నికల సంఘాలతో కలిసి, కేంద్ర ఎన్నికల సంఘం ఒకే ఫోటో గుర్తింపు కార్డును జారీ చేయాలి. - ఎన్నికల సామాగ్రి, ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, పోలింగ్ సిబ్బంది ఏర్పాట్లపై ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు చేయాలి.