Page Loader
Telangana: బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్‌ విద్యాశాఖ శ్రీకారం
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్‌ విద్యాశాఖ శ్రీకారం

Telangana: బోధనలో నాణ్యత పెంచే లక్ష్యంతో.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులకు ఇంటర్‌ విద్యాశాఖ శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బోధన నాణ్యతను మెరుగుపరచడానికి ఇంటర్‌ విద్యాశాఖ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరు కేంద్రంగా నిర్వహిస్తున్న'ఏక్‌స్టెప్‌ ఫౌండేషన్‌'తో కలిసి వచ్చే విద్యా సంవత్సరమైన 2025-26లో సుమారు 100 ప్రభుత్వ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం పైలట్‌ ప్రాజెక్ట్‌గా బుధవారం నాంపల్లి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, చంచల్‌గూడ జూనియర్‌ కళాశాలలో ప్రారంభమైంది. ఇందులో కమ్యూనికేషన్ నైపుణ్యాలు,ఇంటర్వ్యూలకు అవసరమైన శిక్షణ వంటి అంశాలపై విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు.

వివరాలు 

423 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు ఈ తరహా తరగతులు 

అధ్యాపకుల కొరత, నైపుణ్యాల లోపం వంటి సమస్యల పరిష్కారానికి ఆన్‌లైన్‌ తరగతులు సమర్థవంతంగా ఉపయోగపడతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ తరహా తరగతులను రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా మొత్తం 423 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు విస్తరించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, కంట్రోలర్‌ జయప్రద బాయి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.