
Operation Ajay: 235మందితో ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరుకున్న రెండో విమానం
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధ నడుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఆపరేషన్ అజయ్‌లో భాగంగా భారతీయులను తరలిస్తోంది.
ఈ నేథ్యంలో శనివారం 235మందితో కూడిన ప్రత్యేక విమనం ఇజ్రాయెల్ నుంచి దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయానికి చేరుకుంది. ఇందులో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
అలాగే, ఇజ్రాయెల్ నుంచి 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి విమానం శుక్రవారం దిల్లీకి చేరుకోగా, శనివారం రెండో విమానం వచ్చింది.
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత రాయబార కార్యాలయం ఆన్ లైన్ డ్రైవ్‌ను చేప్టటింది.
ఇందులో నమోదు చేసుకున్న వారిని తరలిస్తోంది. అంతేకాకుండా, ఈ తరలింపు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది.
ఇజ్రాయెల్
ఆదివారం కూడా భారతీయులు తరలింపు
అక్టోబర్ 7న గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పట్టణాలపై ఆకస్మిక దాడులు చేసిన విషయం తెలిసిందే.
హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ కూడా రాకెట్లతో విరుచుకుపడుతోంది.
ఈ క్రమంలో అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ అజయ్' ప్రారంభించింది.
ఇదిలా ఉంటే, భారతీయుల తరలింపు ఆదివారం కూడా కొనసాగుతుందని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
'ఆపరేషన్ అజయ్' చేపట్టిన భారత ప్రభుత్వానికి ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇజ్రాయెల్‌లో దాదాపు 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో సంరక్షకులు, విద్యార్థులు, ఐటీ నిపుణులు, వజ్రాల వ్యాపారులు ఉన్నారు.