సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్) మధ్య భీకర ఆదిపత్య పోరు జరుగుతోంది. ఈ పోరాటం కారణంగా సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారతదేశం 'ఆపరేషన్ కావేరి'ని ప్రారంభించింది.
వైమానిక దళానికి చెందిన రెండు సీ-130జే విమానాలు జెడ్డాలో సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అలాగే భారతీయ పౌరులను తరలించడానికి 'ఐఎన్ఎస్ సుమేధ' కూడా సూడాన్ పోర్టుకు చేరకున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.
దాదాపు 4000మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నట్లు కేంద్రం తెలిపింది.
సూడాన్
సూడాన్ పోర్టుకు చేరుకుంటున్న భారతీయులు
సాధారణ సైన్యం మరియు పారామిలిటరీ బృందం మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా భీకర పోరును ఎదుర్కొంటున్న సూడాన్ నుంచి తమ ప్రజలను తిరిగి తీసుకురావడానికి భారతదేశం సోమవారం 'ఆపరేషన్ కావేరి' ప్రారంభించింది.
సుడాన్ నుంచి భారతీయ పౌరులను తరలించే ప్రయత్నం జరుగుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. సుమారు 500 మంది పౌరులు పోర్ట్ సూడాన్‌కు చేరుకున్నారని ఆయన చెప్పారు.
మరికొంతమంది మార్గ మధ్యలో ఉన్నారని జైశంకర్ ఈ ట్వీట్ చేశారు. సౌదీ అరేబియా, యూఏఈలోని రాయబారుల సమన్వయంతో ఎస్ జైశంకర్ భారతీయులను స్వదేశానికి తరలింపును ముమ్మరం చేశారు.