
operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ తన స్థిరమైన, కఠినమైన కశ్మీర్ విధానాన్ని మరోసారి స్పష్టంగా ప్రకటించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) తిరిగి పొందడమే మిగిలిన ఒకే ఒక్క అంశమని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
ఈ నెల 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాకిస్థాన్ డీజీఎంవోకి సమాచారం ఇచ్చినట్లు విదేశాంగశాఖ పేర్కొంది.
చర్చలకు సిద్ధమున్నామని పేర్కొన్నప్పటికీ పాక్ నుంచి స్పందన రాలేదని వెల్లడించింది.
అయితే మే 10న కాల్పుల తీవ్రత పెరిగిన తర్వాత పాకిస్థాన్ చర్చల ప్రతిపాదనతో ముందుకొచ్చిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా భారత్ జరిపిన దాడుల్లో రహిమ్యార్‌ఖాన్ వైమానిక స్థావరం పూర్తిగా ధ్వంసమైందని చెప్పింది.
Details
8 ఉగ్రవాద స్థావరాలపై దాడి
బహావల్‌పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు మురుద్కే, ముజఫర్‌బాద్‌లోని ఉగ్ర కేంద్రాలు కూడా ధ్వంసమైనట్లు తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసిన విదేశాంగశాఖ, పాక్ దాడులకు భారత్ బాంబులతో సమాధానం ఇచ్చిందన్నారు.
మొత్తం 8 ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యబద్ధంగా దాడులు జరిగినట్లు పేర్కొంది.
మధ్యవర్తిత్వం అవసరం లేదు
భారత వైఖరి స్పష్టమని విదేశాంగశాఖ మరోసారి స్పష్టం చేసింది. కేవలం పీఓకే విషయమే మిగిలి ఉందన్నారు.
ఉగ్రవాదుల అప్పగింతపై మాత్రమే చర్చలు ఉంటాయని, మిగతా అంశాలపై చర్చల ఆసక్తి లేదని చెప్పింది. ఇదే సందర్భంలో 'మధ్యవర్తిత్వానికి భారత్ తావివ్వదలేదని తెలిపింది.
Details
ఆపరేషన్ సిందూర్ విజయవంతం
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ మూడు ప్రధాన లక్ష్యాలు సాధించింది—సైనికంగా, రాజకీయంగా, మానసికంగా పాక్‌ను తీవ్రంగా దెబ్బకొట్టిందని వెల్లడించింది.
ప్రతి దశలోనూ పాకిస్థాన్ వెనుకబడిందని, భారత్ ఆధిపత్యాన్ని ఆ దేశం అంగీకరించక తప్పలేదని తెలిపింది.
పాక్ వైమానిక స్థావరాలపై జరిగిన దాడుల తర్వాత దాయాది దేశం ఇక పోరాడలేమని గ్రహించినట్లు పేర్కొంది.