
Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్ సిందూర్' : భారత సైన్యం
ఈ వార్తాకథనం ఏంటి
భారత సైన్యం ఉగ్రవాద నిర్మూలనకే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించామని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు తెలిపింది.
ఈ దాడుల భయంతో ఉగ్ర శిబిరాలు ఖాళీ అవుతున్నాయని ఆర్మీ వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ముష్కరులు చేసిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక వివరాలను త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు, పాకిస్థాన్‌లోని నలుగు ఉగ్ర శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిపారు.
Details
100 మంది ఉగ్రవాదులు హతం
ఈ నేపథ్యంలో ఆర్మీ డీజీఎంవో రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులకు గట్టి కౌంటర్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం.
ఈ నేపథ్యంలో 'ఆపరేషన్ సిందూర్'ను అమలు చేశాం. సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను ఖచ్చితమైన ఆధారాల ఆధారంగా గుర్తించాం. వాటిపై స్పష్టమైన సమాచారంతో మోపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ చర్యలతో పాకిస్థాన్ గట్టిగా వణికిపోయింది. అనంతరం మన పౌరులపై దాడులకు పాల్పడి, దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుందని స్పష్టం చేశారు.