Loading...
EC Row: జ్ఞానేశ్‌ కుమార్‌పై మరోసారి అభిశంసన.. ఉభయ సభల్లో నోటీసులకు విపక్షాల సిద్ధం
జ్ఞానేశ్‌ కుమార్‌పై మరోసారి అభిశంసన.. ఉభయ సభల్లో నోటీసులకు విపక్షాల సిద్ధం

EC Row: జ్ఞానేశ్‌ కుమార్‌పై మరోసారి అభిశంసన.. ఉభయ సభల్లో నోటీసులకు విపక్షాల సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2026
05:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇటీవల వెలువడిన కథనాల నేపథ్యంలో విపక్ష పార్టీలు మరోసారి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తొలగించే ప్రక్రియకు సిద్ధమవుతున్నాయి. జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కలిసి ఈ అంశంపై ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉభయ సభల్లో నోటీసులు జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాను న్యాయ నిపుణుల సహకారంతో రూపొందిస్తున్నట్లు సమాచారం. న్యాయపరమైన పరిశీలన పూర్తయిన తర్వాత త్వరలోనే లోక్‌సభ, రాజ్యసభల్లో నోటీసులు సమర్పించనున్నట్లు విపక్ష వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నాలు

సీఈసీని తొలగించేందుకు విపక్షాలు ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు.

మార్చి 12న లోక్‌సభ, రాజ్యసభల్లో ఇచ్చిన నోటీసులు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం ఏప్రిల్‌ 24న రాజ్యసభలో 73 మంది విపక్ష ఎంపీలు జ్ఞానేశ్‌ కుమార్‌ తొలగింపును కోరుతూ మరో నోటీసు సమర్పించారు.

ఈ నోటీసులో 'నిరూపిత దుష్ప్రవర్తన'కు సంబంధించిన తొమ్మిది ఆరోపణలను ప్రస్తావించినట్లు అప్పట్లో వెల్లడైంది.

ఏప్రిల్‌ 24న ఇచ్చిన నోటీసు రాజ్యసభలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్లు విపక్ష వర్గాలు చెబుతున్నాయి.

తాజాగా ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ వచ్చిన నివేదికలు ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి.

వివరాలు 

ఈసీలో భిన్నాభిప్రాయాలపై చర్చ

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) సహా ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు నివేదికలు వెలువడ్డాయి.

గత కొన్ని నెలల్లో 14 సందర్భాల్లో వారు నిర్ణయాలపై అభిప్రాయభేదాలు నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఎన్నికల సంఘం మాత్రం కమిషనర్ల మధ్య అభిప్రాయాలు,పరిశీలనలు వ్యక్తం చేయడం సాధారణ ప్రక్రియేనని,గత ఏడాది కాలంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు పూర్తి కమిషన్‌ ఏకాభిప్రాయంతోనే జరిగాయని స్పష్టం చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే జ్ఞానేశ్‌ కుమార్‌ను తొలగించేందుకు మరోసారి అభిశంసన తీర్మానం తీసుకురావాలని విపక్షాలు నిర్ణయించినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

గత నోటీసు ఏం చెబుతోంది?

ఈ ప్రక్రియలో 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్‌ ముందుకు వెళ్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఏప్రిల్‌లో రాజ్యసభలో సమర్పించిన నోటీసుకు 73 మంది విపక్ష ఎంపీల మద్దతు లభించింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(5), ఆర్టికల్‌ 124(4), 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలోని నిబంధనలు, జడ్జెస్‌ (ఇంక్వైరీ) చట్టం తదితర నిబంధనలను ప్రస్తావిస్తూ ఆ నోటీసు ఇచ్చారు.

ఇప్పుడు ఎన్నికల సంఘంలో అంతర్గతంగా చోటుచేసుకున్నట్లు వచ్చిన భిన్నాభిప్రాయాల నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త నోటీసు ముసాయిదాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

దీంతో జ్ఞానేశ్‌ కుమార్‌ వ్యవహారం మరోసారి పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఏర్పడింది.

ADVERTISEMENT