
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దే యోజనలో భాగంగా, సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించినగా 500 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ భూమిని జీవీఐఏఎల్ (GVIAL) సంస్థకు అప్పగించేందుకు ఇటీవలే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మాస్టర్ ప్లాన్ ప్రకారం, విమానాశ్రయ అభివృద్ధికి మొత్తం 1,733 ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేయగా, జాతీయ రహదారి నుండి విమానాశ్రయం వరకు అనుసంధాన సౌకర్యం కోసం అదనంగా 92 ఎకరాలను ప్రతిపాదించారు.
వివరాలు
అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్
విమానాశ్రయం లోపల కార్గో సేవల విస్తరణ కోసం 83.5ఎకరాలు,నార్త్ టెర్మినల్ భవన నిర్మాణానికి 98 ఎకరాలు,అలాగే విమానాశ్రయ పరిమితిని ఏర్పాటు చేయడానికి 494ఎకరాలు అవసరమవుతాయని ప్రణాళికలు రూపొందించారు.
నివాస ప్రాంతాలు,ఇతర మౌలిక అవసరాల కోసం 201 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించారు.
ఏటా సుమారు 36 మిలియన్ల ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని,ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించారు.
ఈ ప్రణాళిక ప్రకారం మొత్తం 2,703ఎకరాలు అవసరమవుతాయని భావించినా,గత వైసీపీ ప్రభుత్వం కేవలం 2,203ఎకరాల భూమినే కేటాయించింది.
ప్రస్తుతం ఈప్రాజెక్ట్ ఆర్థిక స్థిరత్వాన్ని(వయబిలిటీ)పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు అవసరాలు, సిటీ సైడ్ డెవలప్‌మెంట్ దృష్ట్యా మిగిలిన 500ఎకరాలను కేటాయిస్తూ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.