Bomb threat e mail-Delhi- Schools:ఢిల్లీ స్కూళ్లకు బాంబు ఉందంటూ బెదిరింపు ఈ మెయిల్స్...రంగంలోకి దిగిన తనిఖీ బృందాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మెయిల్ (Email)ద్వారా బాంబు బెదిరింపు (Bomb threat) రావడంతో దిల్లీ (Delhi),నోయిడా (Noida)లోని పలు పాఠశాలల (Schools)ను ఖాళీ చేయించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీస్ అధికారులు బాంబ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
క్యాంపస్ లలో బాంబులు అమర్చామంటూ చాణక్యపురిలోని సంస్కృతి స్కూల్,తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లకు బుధవారం తెల్లవారుజామున బాంబు ఉందంటూ ఈ గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ పంపారు.
ఆ తర్వాత మరో 50 స్కూళ్లకు కూడా ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి.
దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఆయా పాఠశాలల విద్యార్థులను ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు.
Bomb threat e mail
తనిఖీలు చేస్తున్న బృందాలు
ఇప్పటివరకూ అనుమానస్పదంగా ఎటువంటి బాంబులు గానీ, పేలుడు పదార్థాలు గానీ తనిఖీల్లో బయటపడలేదు.
ఈ బెదింపు మెయిల్ ఎవరు పంపారు?ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఐపీ అడ్రస్ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఎవరైనా ఆకతాయిల పనా లేక దీని వెనుక ఏదైనా ఉగ్ర కుట్ర ఉందా అనే కోణంలో కూడా పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
పరీక్ష నిర్వహిస్తున్న ఓ పాఠశాలకు ఈ మెయిల్ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వెళ్లి విద్యార్థులను ఖాళీ చేయించారు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పాఠశాలలకు చేరుకుని తమ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఆర్.కె.పురం లోని ఓ పాఠశాలకు బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.