Page Loader
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!
పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్‌ ప్రాగణంలో అత్యవసర భేటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2025
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దేశం మొత్తం షాక్‌కు లోనైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కీలక భేటీలు జరుగుతున్నాయి. తాజాగా పార్లమెంట్ ప్రాంగణంలో రక్షణ వ్యవహారాలపై స్టాండింగ్‌ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీలు రాధా మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, విష్ణుపాల్ రే, జగన్నాథ్‌ సర్కార్, శక్తి సింగ్‌ గోహిల్, సంజయ్‌ సింగ్ హాజరయ్యారు. ఈ ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ భేటీ అయ్యారు. పహల్గాంలో పరిస్థితులు, భద్రతా రంగంలో సైన్యం తీసుకున్న చర్యలపై ప్రధానికి సమగ్ర నివేదిక ఇచ్చారు.

Details

40 నిమిషాల పాటు భేటీ

దాదాపు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఆదివారం రోజుననే రాజ్‌నాథ్‌ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్‌తో భేటీ అయి, భారత్‌ తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. ఆ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలను కూడా రాజ్‌నాథ్‌ ఈరోజు మోదీకి వివరించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా హాజరయ్యారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, భద్రతా లోపం కనిపించిందని విపక్షాలు ఆరోపించాయి. దాడి జరిగిన సమయంలో భద్రతా బలగాలు, సీఆర్పీఎఫ్‌ ఎక్కడున్నాయంటూ పలు నేతలు ప్రశ్నలు సంధించారు.

Details

కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

దీనిపై కేంద్రం తరఫు నుంచి ఓ మంత్రి స్పందిస్తూ, ''సాధారణంగా జూన్‌లో ప్రారంభమయ్యే అమర్‌నాథ్‌ యాత్ర వరకు పహల్గాం ప్రాంతంలో పర్యాటక ప్రవర్తనపై ఆంక్షలు అమలులో ఉంటాయి. కానీ ఈసారి స్థానిక అధికారులు భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వకుండానే బైసరన్‌కు పర్యాటకులను అనుమతించారని వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వ స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.