Page Loader
Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్
నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్

Pak Army : నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు.. దీటుగా బదులిచ్చిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్తత ఏర్పడింది.దాయాది దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ''ఏప్రిల్ 1న కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద పాక్ ఆర్మీ చొరబాట్లు చేసింది. ఈ సమయంలో మందుపాతర పేలింది. అనంతరం పాక్ సైన్యం కాల్పులు జరిపి ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం సముచితంగా ప్రతిస్పందించింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉంది'' అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ప్రాణనష్టం వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నియంత్రణ రేఖను దాటొచ్చి పాక్‌ ఆర్మీ కాల్పులు