Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఏడుగురు ఉగ్రవాదులు హతం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఇటీవల భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
పూంచ్ జిల్లా క్రిష్ణఘాటి సెక్టార్‌లో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు చొరబాటుదారులు హతమయ్యారు.
వీరిలో ముగ్గురు పాకిస్థాన్ ఆర్మీకి చెందిన జవాన్లే కావడం విశేషం.
ఫిబ్రవరి 4 అర్ధరాత్రి, పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
అయితే, భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరించి,వారిని అడ్డుకుని కాల్పులు జరిపింది.
ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు చొరబాటుదారులు మృతి చెందారు.
ఫిబ్రవరి5వ తేదీని కాశ్మీర్ లిబరేషన్ డేగా పాకిస్తాన్ జరుపుకుంది.
అదే రోజు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన జవాన్లు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడం గమనార్హం.
వివరాలు
డిసెంబర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతం
అయితే, భారత సైన్యం తక్షణమే స్పందించి వారి కుట్రను విఫలమయ్యేలా చేసింది.
ఇటీవల జమ్ము కశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు అనేక మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.
ఈ ఘర్షణల్లో పలువురు జవాన్లు గాయపడ్డారు. డిసెంబర్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమైన విషయం కూడా తెలిసిందే.