LOADING...
IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..
పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..

IND vs PAK: పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ.. నిధుల విడుదలపై భారత్ అభ్యంతరం..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం గట్టి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే గత నెలలో పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఒక బిలియన్ డాలర్ల నిధుల ప్యాకేజీ (సుమారుగా రూ. 8,500 కోట్లు) విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిధులను పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు వాడుతుందని భారత్ ఆరోపిస్తోంది. అయినా తాజాగా ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) కూడా పాకిస్తాన్‌కు 800 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని మంజూరు చేసింది.

వివరాలు 

భారత్ తీవ్ర అసంతృప్తి

ఈ పరిణామాలపై కూడా భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 2018లో పాకిస్తాన్ జీడీపీతో పోలిస్తే పన్నుల ఆదాయం 13 శాతంగా ఉన్నప్పటికీ, 2023 నాటికి అది కేవలం 9.2 శాతానికి పడిపోవడం, మరోవైపు ఆ దేశ రక్షణ ఖర్చులు పెరిగిపోవడం పాక్ ఆర్థిక స్థితి మరింత క్షీణించడానికి కారణమవుతుందని భారత్ అభిప్రాయపడింది. అంతేకాక, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి వచ్చే నిధులను పాకిస్తాన్ అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా సైనిక అవసరాలకే వినియోగిస్తున్నదని భారతదేశం ఆరోపించింది.