
operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఇటీవల ఎక్స్‌పై (ఒకప్పటి ట్విటర్) నిషేధం విధించినప్పటికీ, భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టగానే అది రద్దు చేసి, ఫేక్‌న్యూస్ యుద్ధానికి తెరతీసింది.
దురదృష్టవశాత్తు, ఆ దేశం తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించింది, కానీ భారత్ ఈ సృష్టించిన అబద్ధాలను ఫ్యాక్ట్ చెక్ ద్వారా తిరస్కరించింది.
శనివారం పాకిస్థాన్ స్ట్రాటజిక్ ఎనలిస్ట్ కమర్ చీమా, గ్లోబల్ డిఫెన్స్ ఇన్‌సైట్ అనే హ్యాండిల్స్ ద్వారా భారత్‌పై మరో దుష్ప్రచారం ప్రారంభించారు.
ఈసారి పాక్ సైబర్ సైన్యం భారత్ పవర్‌గ్రిడ్ 70శాతం వర్కింగ్ లేకుండా చేసినట్లు ఆరోపణలు మోపారు. కానీ, పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఈ వార్తను ఫ్యాక్ట్ చెక్ చేసి, ఇది పూర్తిగా తప్పు అని నిర్ధారించింది.
Details
ఫేక్ వార్తలను 16 ఆధారాలతో నిరూపించిన పీఐబీ
పీఐబీ దీనిని తిరస్కరించి, ప్రజలకు ఇలాంటి తప్పుడు ప్రచారాల నుండి దూరంగా ఉండాలని సూచించింది.
అంతేకాకుండా, పాకిస్థాన్ గుజరాత్ పోర్టుపై దాడి, భారత సైనికుల మృతి వంటి అంశాలను కూడా ప్రచారం చేసింది.
అయితే, పీఐబీ ఈ ఫేక్ వార్తలను 16 ఆధారాలతో నిరూపించింది.
గుజరాత్‌లోని హజీరా పోర్టుపై దాడి జరిగినట్లు ఒక వీడియో వైరల్ అయినా, అది 2021 లో జరిగిన ఆయిల్ ట్యాంకర్ పేలుడు వీడియో అని వెల్లడైంది.
Details
నకిలీ ప్రచారాలను నమ్మొద్దు
అలాగే, జలంధర్ లో డ్రోన్ దాడి, అమృత్‌సర్‌లో సైనిక స్థావరంపై దాడి వంటి వీడియోలు కూడా పాకిస్థాన్ రూపొందించిన నకిలీ ప్రచారమనే విషయం ఎండగట్టింది.
పాక్ ఆర్మీ ద్వారా భారతీయ డ్రోన్ కూల్చినట్లు వ్యాప్తి చేసిన వీడియో కూడా సరైనదేమీ కావడం లేదు.
జమ్ముకశ్మీర్ ఎయిర్‌బేస్ పై పాక్ దాడి జరిపిందని పాకిస్థాన్ అనుకూల 'ఎక్స్' ఖాతాల్లో పోస్ట్ చేసిన దృశ్యాలు కూడా పూర్తిగా తప్పుడు సమాచారమని పీఐబీ నిరూపించింది.
2021లో అఫ్గానిస్థాన్‌లో కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుడు ఫోటోను కూడా సరిగ్గా ఉపయోగించారని పేర్కొంది.