Page Loader
India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్‌ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్‌ 
నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్‌ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్‌

India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్‌ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
08:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటాయి.పాకిస్తాన్‌ ఆర్మీ కవ్వింపులకు దిగుతూ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున పాక్‌ సైన్యం అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతతో కూడిన పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌ సైన్యం జరిపిన కాల్పులకు భారత భద్రతా దళాలు సమర్థంగా ప్రతిదాడులు చేశాయి. పాక్‌ కవ్వింపులను భారత ఆర్మీ ధైర్యంగా ఎదుర్కొంటోంది.

వివరాలు 

భారత్‌-పాకిస్తాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు

వివరాల్లోకి వెళ్తే... ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్తాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ఉన్న తమ పోస్టుల నుంచే కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దుశ్చర్యతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, శత్రువు చర్యలకు భారత ఆర్మీ ధీటైన ప్రతిస్పందన ఇస్తోంది. పాక్‌ సైన్యం కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ దేశ భద్రతను కాపాడుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాకిస్తాన్‌