
Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ అంగీకరించిన కొద్దిగంటలకే ఒప్పందాన్ని పక్కనపెట్టి మళ్లీ దుశ్చర్యలకు పాల్పడింది.
అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ బలగాలు అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌ల వైపు ఫిరంగి దాడులకు పాల్పడినట్లు సమాచారం.
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో పాకిస్థాన్ డ్రోన్ చొరబాటు కలకలం సృష్టించింది. అలాగే ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
అప్రమత్తంగా ఉన్న భారత భద్రతా దళాలు ఒక డ్రోన్‌ను గుర్తించి కూల్చివేశాయి.
Details
ధీటుగా బదులిచ్చిన భారత్
జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంట కూడా కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది.
ఇక భారత్-పాక్ మధ్య ఇటీవల ఉద్రిక్తతలు తగ్గినట్లుగా అనిపించిన వేళ, ఈ పరిణామం మళ్లీ ఉద్రిక్తతలను పెంచింది.
ఇరుదేశాల విదేశాంగ శాఖలు కాల్పుల విరమణకు అంగీకరించామని అధికారికంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాక్ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది.
అయితే, భారత సైన్యం ధీటుగా సమాధానం ఇస్తోంది. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుందని ఇప్పటికే వెల్లడించింది.