
X Handle: భారత్‌లో పాక్ రక్షణ మంత్రికి షాక్.. ఖవాజా అసిఫ్ 'ఎక్స్' ఖాతా బ్లాక్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ అసిఫ్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో భారత ప్రభుత్వం ఆయన ఎక్స్ (మాజీ ట్విటర్) ఖాతాను బ్లాక్ చేసింది.
ఇప్పటికే పాకిస్థాన్ ఆధారిత పలు యూట్యూబ్ ఛానళ్లను నిషేధించిన కేంద్రం, తాజాగా ఖవాజా ఖాతాపై వేటు వేసింది.
ఆయన ఖాతాను ఓపెన్ చేయగానే 'చట్టపరమైన డిమాండ్‌కు స్పందనగా ఈ ఖాతా నిలిపివేశామని అనే సందేశం వినియోగదారులకు కనపడుతోంది.
భారత్, పాకిస్థాన్ మధ్య వాస్తవాలు మరుగున పడేలా సమాచారం ప్రసారం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. పహల్గాం దాడి తర్వాత మళ్లీ పాక్ మంత్రిగా ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Details
బలగాలను అప్రమత్తం చేశాం
అమెరికా, బ్రిటన్ తదితర పశ్చిమ దేశాల కోసమే మేము మూడు దశాబ్దాలుగా ఈ చెత్త పనుల్లో పాల్గొన్నాం. అది ఒక పొరబాటు. దాని వల్లే పాక్ ఇబ్బందులు పడుతోంది.
సోవియట్ యుద్ధంలో పాల్గొనకుండా ఉండి ఉంటే, పాక్‌కు గొప్ప రికార్డ్ ఉండేదని వ్యాఖ్యానించారు. అయితే, లష్కరే తోయిబా ఇప్పుడు తమ దేశంలో లేదంటూ వివరణ ఇచ్చారు.
ఇక సోమవారం ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్ ప్రతీకార దాడి జరగొచ్చు అన్న నేపథ్యంలో తాము మా బలగాలను అప్రమత్తం చేశాం. కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.
Details
పాక్ ఆధారిత ఛానళ్లపై నిషేధం
అయితే, ఏ దిశగా చర్యలు తీసుకున్నారన్న వివరాలు వెల్లడించలేదు. గత నెల 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన తర్వాత భారత్ పాక్‌పై కఠిన వైఖరి అవలంబించింది. పాక్ ఆధారిత ఛానళ్లపై నిషేధం, పాక్ జాతీయులను దేశం నుంచి పంపివేత వంటి చర్యలు తీసుకుంటోంది.
తాజా చర్యగా పాక్ రక్షణమంత్రికి చెందిన ఎక్స్ ఖాతాను కూడా బ్లాక్ చేసింది.