తదుపరి వార్తా కథనం

Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 10, 2025
11:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
శనివారం రాత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం తీవ్రంగా ఖండించతగిన చర్య అని తెలిపారు.
డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య ఏర్పడిన అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదని స్పష్టం చేశారు.
కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది తీవ్రంగా గమనించదగ్గ విషయమని ఆయన అన్నారు.
ఈ చర్యలు అత్యంత దుర్మార్గమని, భారత ప్రభుత్వం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నదని విక్రమ్ మిస్రీ వెల్లడించారు.