LOADING...
PM Modi:'బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్! 
బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్

PM Modi:'బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్‌కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి భారత్‌ ఇచ్చిన ప్రతిస్పందన 'ఆపరేషన్ సిందూర్' గురించి ప్రశంసలు కురిపించారు. మే 7న భారత్‌ పాకిస్తాన్‌ మరియు పీఓకేలోని ఉగ్రస్థావరాలపై చేపట్టిన తీవ్ర దాడి ద్వారా దేశీయంగా తయారైన ఆయుధాల శక్తిని ప్రపంచానికి చూపించగలిగామని పేర్కొన్నారు. భారత వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లు అంతా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినవే కావడం ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యం ఎంత బలంగా కొనసాగుతోందో స్పష్టమైందని ప్రధాని మోదీ వివరించారు.

Details

తీవ్ర స్థాయిలో మండిపడ్డ మోదీ

బ్రహ్మోస్ క్షిపణుల గురించి మాట్లాడుతూ, ఇవి శత్రు దేశాల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయని, 'బ్రహ్మోస్ శబ్దం వింటే పాకిస్తాన్ నిద్రపోవదంటూ వ్యాఖ్యానించారు. లక్నోలో స్థాపించిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సెంటర్ పై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో తయారవుతున్న ఈ క్షిపణులు భవిష్యత్తులో పాకిస్తాన్‌ ఏదైనా ఉగ్రచర్యలకు పాల్పడితే ఉగ్రవాదులను ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. 'ఆపరేషన్ సిందూర్'పై విమర్శలు గుప్పించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్‌లపై మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పాకిస్తాన్ బాధపడితే ఈ పార్టీలు తట్టుకోలేకపోతున్నాయంటూ ఎద్దేవా చేశారు.

Details

ప్రతీకారం తీర్చుకున్నాం

కాంగ్రెస్‌ మన సైన్యాన్ని ఎప్పుడూ అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. పహల్గామ్ దాడిలో 26 మంది పౌరుల మరణానికి ప్రతీకారంగా ఉగ్రవాదులను చంపిన విషయాన్ని ఎస్పీ ప్రశ్నించడాన్ని కూడా మోదీ తక్కువచేశారు. ''వారికి ముందుగా చెప్పి చేసి ఉండాలంటూ కౌంటర్ ఇచ్చారు. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చేందుకు ఇచ్చిన హామీని శివుని ఆశీస్సులతో నెరవేర్చామని ప్రధాని మోదీ అన్నారు.