Simultaneous elections: జమిలిపై కోవింద్ కమిటీ రిపోర్టు.. 7 దేశాల్లో అధ్యయనం
బీజేపీ, దేశవ్యాప్తంగా ఒక దేశం.. ఒకే ఎన్నికల నినాదంతో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా జమిలి ఎన్నికల ప్రక్రియకు తెర తీసింది. కొన్నేళ్లుగా ఈ విషయం పై నిశిత పరిశీలనలో ఉన్న బీజేపీ, తాజాగా, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఒక నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ నివేదికను కేంద్ర కేబినెట్ సమీక్షించి ఆమోదం తెలపడంతో పాటు, రానున్న శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోడీ సర్కారు ప్రకటించింది. జమిలి ఎన్నికలపై ఇచ్చిన నివేదికను రాష్ట్రపతికి అందజేయడంతో పాటు, బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవింద్ కమిటీ 7 దేశాల్లో ఈ ఎన్నికలపై అధ్యయనం చేసింది. అందులో దక్షిణాఫ్రికా,స్వీడన్, బెల్జియం,జర్మనీ, జపాన్,ఇండోనేసియా,ఫిలిప్పీన్స్ ఉన్నాయి.
ఎన్నికలపై వివిధ దేశాలలో అధ్యయనం
దక్షిణాఫ్రికా: జాతీయ అసెంబ్లీకి, ప్రొవిన్షియల్ లేజిస్లేచర్లకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. తరువాత స్థానిక సంస్థలకు ఐదేళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారు. స్వీడన్: నైష్పత్తిక ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పార్లమెంటు, కౌంటీ కౌన్సిళ్లు, మున్సిపల్ కౌన్సిళ్లకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ రెండో ఆదివారంలో నాలుగేళ్లకు ఒకసారి, మున్సిపల్ ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరుగుతాయి. జర్మనీ: ఛాన్సలర్ నియామకంతోపాటు, నిర్మాణాత్మక ఓటు అవిశ్వాస తీర్మానానికి ఉపయోగపడుతుంది. జపాన్: ప్రధాని అభ్యర్థిని నేషనల్ డైట్ నిర్ణయించి, రాజు ఆమోదిస్తాడు. ఇండోనేసియా: 2019 నుండి జమిలి ఎన్నికలను నిర్వహిస్తోంది.