Page Loader
Andhrapradesh: ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ
ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ

Andhrapradesh: ఫిర్యాదుల స్వీకరణకు పోలీసు శాఖ కొత్త పంథా.. కాగిత రహితంగా ఫిర్యాదుల స్వీకరణ

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
11:43 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలీసు శాఖ ఇప్పుడు ఫిర్యాదుల స్వీకరణలో కొత్తగా ఒక ఆధునిక విధానాన్ని ప్రవేశపెడుతోంది. బాధితులు తమ సమస్యలు వెల్లడించే సమయంలో,ఆ వివరాలను కృత్రిమ మేధస్సు(ఏఐ) సాంకేతికత సాయంతో వెంటనే రికార్డు చేసి, ఫిర్యాదుగా మలిచే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈవిధానాన్ని రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సందర్భంగా,ఏలూరు జిల్లా పోలీసు కార్యాలయంలో తొలిసారిగా ఈ ఏఐ సేవలను ప్రారంభించారు. కార్యాలయ రిసెప్షన్ వద్దకు వచ్చిన బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అక్కడ ఏర్పాటు చేసిన ఏఐ బోట్‌కు చెబుతారు. ఇదివెంటనే పోలీసు సిబ్బంది నియంత్రణలో ఉండే సిస్టంలో ఫిర్యాదుగా నమోదు అవుతుంది. మొత్తం వ్యవస్థ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఉంటుంది.

వివరాలు 

ప్రాంతీయ భాషలో సంబంధిత ప్రశ్నలు 

ఈ విధానం ద్వారా వృద్ధులు, చదువు లేనివారు, లేదా ఫిర్యాదును స్వయంగా రాయలేని వ్యక్తులు తమ సమస్యను సులభంగా తెలపగలుగుతారు. బాధితులు మాట్లాడే సమయంలో ఏఐ బోట్‌ సంబంధిత ప్రశ్నలను ప్రాంతీయ భాషలో అడుగుతుంది. బాధితులు వాటికి సమాధానాలు ఇవ్వడం ద్వారా వారి సమస్య సమగ్రంగా నమోదు అవుతుంది. ఈ విధానం పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో ఉండి, ఎటువంటి కాగితాలు అవసరం లేకుండా పనిచేస్తుంది.

వివరాలు 

వేగంగా, పారదర్శకంగా.. బాధితులకు న్యాయం  

ఈ కొత్త డిజిటల్ విధానం ప్రధానంగా పారదర్శకతను,బాధ్యతాయుతమైన పోలీసు విధానాన్ని ప్రోత్సహించడానికి ఉపయోగపడనుంది. ప్రభుత్వం ఈ ప్రణాళికను పైలట్ ప్రాజెక్టుగా ఏలూరు జిల్లాలో ప్రారంభించడంతో, ఇది ప్రతిష్ఠాత్మకంగా భావించబడుతోంది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, బాధితులకు త్వరిత న్యాయం అందించడమే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతున్నారు.