Page Loader
భారత్, ఇండియా కాదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో పేరు మార్చే యోచనలో కేంద్రం  
భారత్, ఇండియా కాదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో పేరు మార్చే యోచనలో కేంద్రం

భారత్, ఇండియా కాదు: పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో పేరు మార్చే యోచనలో కేంద్రం  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2023
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారాంతంలో జీ-20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సెప్టెంబరు 9వ తేదీన ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కోసం రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇప్పటికే అతిథులకు ఆహ్వానాలు అందాయి. అయితే, రాష్ట్రపతి భవన్ నుండి G20 ప్రతినిధులకు పంపిన అధికారిక ఆహ్వానంపై President of India కి బదులుగా President of Bharat అని ముద్రించి ఉండటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది .

Details 

ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ధ్వజం 

కాంగ్రెస్ పార్టీ కి పంపిన ఆహ్వానంలో ఈ మార్పును గమనించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై ధ్వజమెత్తారు. ''జీ-20 విందు కోసం పంపిన ఆహ్వానంలో President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం పంపింది.ఆర్టికల్‌ 1లో చెప్పినట్లు ..భారత్‌,అంటే ఇండియా,రాష్ట్రాల సమాఖ్య అని ఉంటుంది.కానీ,ఇప్పుడు ఈ రాష్ట్రాల సమాఖ్యపైనా దాడి జరుగుతోంది''అంటూ ట్వీట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశానికి INDIA అని పేరు మార్చే ప్రతిపాదనను తీసుకురావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.అయితే ఇంకా కేంద్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పేరు మార్పు పై జైరాం రమేశ్‌ ట్వీట్ 

Details 

దేశం పేరు మార్పు పై అసోం సీఎం హర్షం

జైరాం రమేశ్ చేసిన ట్వీట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. కాంగ్రెస్ భారత్ పేరును వివాదాస్పదం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేసిన కాంగ్రెస్ ఈ విషయంపై ఎందుకు ద్వేషిస్తున్నారని అని రాహుల్ గాంధీని నిలదీశారు. కాంగ్రెస్‌కు దేశంపైనా, దేశ రాజ్యాంగంపైనా, రాజ్యాంగ వ్యవస్థలపైనా గౌరవం లేదని మండిపడ్డారు. సీఎం దేశం పేరు మార్పు పై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్- మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు.