Loading...
Parliament Session: నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. డిసెంబర్ 2న రాజ్యసభ
నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. డిసెంబర్ 2న రాజ్యసభ

Parliament Session: నవంబర్ 30 నుంచి లోక్‌సభ సమావేశాలు.. డిసెంబర్ 2న రాజ్యసభ

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
07:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్ సమావేశాలను తిరిగి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 30, సోమవారం లోక్‌సభ, డిసెంబర్ 2, బుధవారం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన కార్యక్రమాలు, పనులను చేపట్టేందుకు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగానే ఈ భేటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు గురువారం ఓ సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. ఉభయ సభల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను బట్టి డిసెంబర్ 3న సమావేశాలు ముగిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

వివరాలు 

100 రోజులకు పైగా విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు

మరోవైపు పార్లమెంట్‌లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

అయితే, తాజా సమావేశాల్లో ఏయే బిల్లులను చేపట్టనున్నారనే విషయాన్ని కిరణ్ రిజిజు తన ప్రకటనలో స్పష్టం చేయలేదు.

కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ అధికారికంగా ఇంకా ముగియలేదు.

ఆగస్టు 13న లోక్‌సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా (అడ్జర్న్‌మెంట్ సైన్ డై) వేశారు.

అయితే, ఇప్పటివరకు రాష్ట్రపతి ఈ సమావేశాలను అధికారికంగా ముగిస్తూ ప్రొరోగ్ చేయలేదు.

దీంతో 100 రోజులకు పైగా విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు తిరిగి జరగనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కిరెణ్ రిజిజు చేసిన ట్వీట్ 

ADVERTISEMENT