
BJP MP: ఇలా అయితే పార్లమెంట్ మూసేయాలి.. సుప్రీంకోర్టుపై బీజేపీ ఎంపీ అసహనం..
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన అనంతరం,రాష్ట్రపతి సంతకంతో చట్టబద్ధమైన ''వక్ఫ్ సవరణ బిల్లు''పై వ్యతిరేకత వెల్లివిరిసింది.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై బుధవారం నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.
ఈ బిల్లులో ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో చేర్చడం, అలాగే ''వక్ఫ్-బై-యూజర్'' అనే పద్ధతిలో ఉన్న ఆస్తులను డీనోటిఫై చేయడం వంటి కొన్ని నిబంధనలు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో,తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ కౌన్సిల్స్‌లో ముస్లిమేతరుల నియామకాలు జరగవు అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.
వివరాలు
సుప్రీంకోర్టు వ్యవహారంపై బీజేపీ ఎంపీలు అసంతృప్తి
అలాగే ఇప్పటికే నోటిఫై చేయబడ్డ లేదా నమోదు చేయబడ్డ వక్ఫ్-బై-యూజర్ ఆస్తులు సహా ఏ వక్ఫ్ ఆస్తినీ డీనోటిఫై చేయబోమని స్పష్టం చేసింది.
ఈ సమయంలో జిల్లా కలెక్టర్లు వాటి స్థితిలో మార్పులు చేయరని తెలిపింది.
ఈ హామీలన్నింటినీ సుప్రీంకోర్టు రికార్డు చేసింది. దీనితోపాటు, ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని (స్టేటస్ కో) ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామాలపై బీజేపీకి చెందిన కొంతమంది ఎంపీలు సుప్రీంకోర్టు వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ చట్టాలు రూపొందించాలని భావిస్తే,పార్లమెంటు అవసరం ఏంటీ? అని ప్రశ్నించారు.
వివరాలు
తదుపరి విచారణ మే 5న
సుప్రీంకోర్టు చట్టాలు తయారుచేస్తే, పార్లమెంట్ భవనాన్ని మూసివేయాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ, పరోక్షంగా న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు.
ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ స్పందనకు సుప్రీంకోర్టు వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ మే 5న జరగనుంది.
1995లో అమలులోకి వచ్చిన వక్ఫ్ చట్టానికి 2025లో తెచ్చిన సవరణలు రాజ్యాంగానికి అనుకూలమా కాదా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా,న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం వరుసగా రెండవ రోజూ విచారించింది.
బుధవారం జరిగిన విచారణలో చట్టంలోని పలు నిబంధనలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. కొన్ని నిబంధనలు రాజ్యాంగ సమీక్షకు తగనివే కావచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిశికాంత్ దూబే చేసిన ట్వీట్
क़ानून यदि सुप्रीम कोर्ट ही बनाएगा तो संसद भवन बंद कर देना चाहिये
— Dr Nishikant Dubey (@nishikant_dubey) April 19, 2025