Parliament: 'బయట పేపరు లీకులు, లోపల వాటర్ లీకులు'.. నీటి లీకేజీపై కాంగ్రెస్ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించారు.
అయితే బుధవారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు భవనం పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతోంది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కేంద్రం ఇటీవలే కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది.
తాజాగా రూఫ్ నుంచి వర్షపు నీరు రావడంతో విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
బయట పేపర్ లీకులు, లోపల వాటర్ లీకులు అంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
Details
వాయిదా తీర్మానం
ఇక ఈ అంశంపై లోక్ సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.
గతేడాది 28న ఈ నూతన భవనాన్ని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించగా, ఆ తర్వాత
గతేడాది సెప్టెంబర్ 19న ఈ భవనంలో పార్లమెంట్ సమావేశాలను నిర్వహించారు.
మరోవైపు కొత్త భవనం ప్రారంభించిన ఏడాదికే లీక్ కావడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు చేస్తున్నారు.