Page Loader
Baba Ramdev:: పతంజలి కేసు కీలక మలుపు.. బాబా రామ్‌దేవ్‌పై అరెస్టు వారెంట్ 
పతంజలి కేసు కీలక మలుపు.. బాబా రామ్‌దేవ్‌పై అరెస్టు వారెంట్

Baba Ramdev:: పతంజలి కేసు కీలక మలుపు.. బాబా రామ్‌దేవ్‌పై అరెస్టు వారెంట్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు, యోగా గురువు బాబా రామ్‌దేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. దివ్య ఫార్మసీ తప్పుడు ఆరోగ్య ప్రకటనల వల్ల కేరళ రాష్ట్రంలో పలు కేసులు నమోదు చేయడానికి కారణమయ్యాయి. ఈ కేసుకు సంబంధించి బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ కోర్టు ముందుకు హాజరుకాకపోవడంతో, కోర్టు వారి‌పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. మూడేళ్ల క్రితం కేరళ రాష్ట్రానికి చెందిన ఆఫ్తమాలజిస్ట్ వైద్యుడు కేవీ బాబు ఈ ఫిర్యాదుతో కేరళలో పది కేసులు, ఉత్తరాఖండ్‌లో ఒక కేసు నమోదయ్యాయి.

Details

బాబా

ఆయన చేసిన ఫిర్యాదులపై కేరళ ఔషద నియంత్రణ విభాగం చర్యలు ప్రారంభించింది. అలాగే పతంజలిపై 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో పతంజలి ఆయుర్వేద ప్రొడక్ట్స్ బీపీ, షుగర్ వంటి వ్యాధుల నయం చేస్తాయని ప్రకటించిన యాడ్స్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ప్రకటనలపై క్షమాపణలు చెప్పి యాడ్స్ ఇవ్వాలని ఆదేశించింది.