Page Loader
patna: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం.. రణరంగంగా పాట్నా 
స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం.. రణరంగంగా పాట్నా

patna: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం.. రణరంగంగా పాట్నా 

వ్రాసిన వారు Sirish Praharaju
May 17, 2024
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి మృతదేహం కాలువలో కనిపించడంతో కలకలం రేగింది. మృతదేహం శైలేంద్ర కుమార్‌ కుమారుడు ఆయుష్‌కుమార్‌గా గుర్తించారు.చిన్నారి వయస్సు దాదాపు 4 సంవత్సరాలు. గురువారం సాయంత్రం నుంచి విద్యార్థి అదృశ్యమైనట్లు సమాచారం.తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి వాకబు చేసినా స్కూల్ యాజమాన్యం నుంచి మాత్రం సరైన జవాబు దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు యాజమాన్యంతో గొడవకు దిగారు. కానీ వారి నుంచి సరైన జవాబు మాత్రం లభించలేదు. ఈరోజు ఉదయం స్కూల్ ఆవరణలోని డ్రైనేజీలో చిన్నారి మృతదేహాన్నికనుగొన్నారు. అనంతరం స్కూల్ ఆవరణను మొత్తం వెతికితే డ్రైనేజీలో మృతదేహం కనిపించింది. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు పెద్ద ఎత్తున స్కూల్‌కు చేరి పాఠశాలకు నిప్పుపెట్టారు.

Details 

 అదుపులోకి ముగ్గురు 

మరోవైపు ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్న ప్రజలను శాంతింపజేశారు. స్కూల్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. కెమెరాలో చిన్నారి స్కూల్ లోపలికి వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి గానీ.. బయటకు వచ్చే దృశ్యాలు కనిపించలేదు. దీంతో స్కూల్‌లోనే ఏదో జరిగిందన్నఅనుమానాలు బలపడ్డాయి. పోలీసులు.. మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తరగతి గది లోపల డ్రెయిన్‌లో చిన్నారి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించామని.. హత్య కేసుగానే చూస్తు్న్నట్లు పాట్నా పోలీస్ సూపరింటెండెంట్ చంద్రప్రకాశ్ తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతుందని చంద్రప్రకాశ్ మీడియాకు వెల్లడించారు. .