Pawan Kalyan: ఫిక్స్ అయిపోండి.. రాబోయే ఐదేళ్లూ వైసిపికి ప్రతిపక్ష హోదా రాదు : పవన్ కళ్యాణ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, ప్రజలు ఇస్తానే లభిస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు.
అత్యధిక మెజార్టీతో రెండో స్థానంలో ఉన్న పార్టీకి మాత్రమే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తెలిపారు.
ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్ వద్ద పవన్ మాట్లాడారు.
వివరాలు
వచ్చే ఐదేళ్లలో వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు
''వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారు.కానీ సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన.మాకు కంటే ఒక్క సీటు ఎక్కువ ఉన్నా వాళ్లకు ఆ హోదా లభించేది.ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే సభను అడ్డుకుంటామని మాట్లాడడం తగదు.ప్రజలు ఇచ్చిన 11సీట్లను గౌరవించి అసెంబ్లీకి రండి. సమస్యలను ప్రస్తావించి,ప్రభుత్వ లోటుపాట్లు తెలియజేయండి.స్పీకర్ సంఖ్యానుపాతంగా సమయం కేటాయిస్తారు.వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలి.సభకు రాగానే ఆందోళన చేయడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం.ఫిక్స్ అయిపోండి..11సీట్లతో వచ్చే ఐదేళ్లలో వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు.నా ఉద్దేశ్యం వైకాపాను అవమానించడం కాదు,తగ్గించడం కూడా కాదు.ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.వాటిని దృష్టిలో పెట్టుకుని వైకాపా సభ్యులు ప్రవర్తించాలి. ఓట్ల శాతం ఆధారంగా చూస్తే,వారు జర్మనీ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది''అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.