Page Loader
ఇన్‌స్టాగ్రామ్ లోకి జనసేనాని ఎంట్రీ.. ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు
ఇన్‌స్టాగ్రామ్ లోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ

ఇన్‌స్టాగ్రామ్ లోకి జనసేనాని ఎంట్రీ.. ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 03, 2023
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో ఇన్ స్టాలో అడుగు పెట్టనున్నారు. ఈ మేరకు అభిమానులను, పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా వేదికగా పలకరించనున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు తమ ఇన్‌స్టా అకౌంట్లలో మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. తాజాగా పవన్ ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆయన సోదరుడు,జనసేన నేత నాగబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వరుస సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా మారిన పవన్ కల్యాణ్ ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ వారాహి యాత్రకు స్వల్ప విరామం ప్రకటించారు. ఆ సమయంలోనూ రెస్ట్ లేకుండా బ్రో అనే సినిమాకు డబ్బింగ్ పనులు పూర్తి చేశారు.

DETAILS

జనసేన పార్టీ కార్యక్రమాల కోసమే ఇంస్టా అకౌంట్ 

మరో ఒకటి రెండు రోజుల్లో అకౌంట్ తెరవనున్నామని మెగా బ్రదర్ నాగబాబు తన ఇన్ స్టా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ పవన్ సహా మెగా ఫ్యాన్స్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఖాతాను పవన్ జనసేన పార్టీ కార్యక్రమాల కోసం, రాజకీయ అవసరాల కోసమే వాడనున్నారని సమాచారం. దక్షిణాది సూపర్ స్టార్, తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి అకౌంట్ ప్రారంభించిన 99 నిముషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ ను సాధించి రికార్డును సృష్టించింది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవర్ స్టార్ అభిమానులు ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.