Page Loader
Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ 
Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన పార్టీ కోసం అధినేత పవన్ కళ్యాణ్ రూ. 10కోట్లను విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో సమావేశమైన సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పుకుండా సరైన ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నట్లు పవన్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కూటమిని గెలుపు కోసం ముందుకెళ్లాలన్నారు. 2019 తర్వాత జనసేన కోసం పని చేసిన వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏపీ అభివృద్ధికి సుస్థిర పాలన అవసరమని, అందుకోసం అందరూ కృషి చేయాలన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన ట్వీట్