Pawan Kalyan : గ్రామ సభల నిర్వహణపై అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సచివాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హామీ పథకంలో భాగంగా చేపట్టాల్సిన పనుల కోసం ఈ నెల చివర్లో గ్రామ సభలు నిర్వహించాలని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 23వ తేదీన గ్రామ సభల నిర్వహణ చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 46 రకాలైన పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు.
ఉపాధి హామీ లక్ష్యాన్ని చేరుకోవాలి
ప్రతి రుపాయి బాధ్యతతో ఖర్చు చేసి, ఉపాధి హామీ లక్ష్యాన్ని అందుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయి, మండల, గ్రామస్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమల్లో బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. సోషల్ ఆడిట్ పకడ్బందీగా నిర్వహించాన్నారు. సచివాలయం నుంచి పీఆర్, ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.