Page Loader
నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకి జనసేనానిని  
నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకి జనసేనానిని

నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకి జనసేనానిని  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2023
12:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టు ఘటనపై స్పందించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. మొదటగా ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ సరిహద్దుల్లో గరికపాడు వద్ద పోలీసులు పవన్ ను అడ్డుకున్నారు. అక్కడి నుండి ఎలాగోలాగ జగ్గయ్యపేట దాటిన తర్వాత అక్కడ ఏపీ పోలీసులు ఆపేశారు. ఈ ఘటన తో ఒక్కసారిగా అక్కడకు పెద్దఎత్తున అక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలకి పోలీసులు, మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Details 

జాతీయ రహదారిపై పడుకొని నిరసన తెలిపిన పవన్ 

అలాగే జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వద్ద కూడా పవన్ కు పోలీసుల నుంచి ఆటంకం ఎదురవడంతో ఆయన వాహనం దిగి కాలినడకన మంగళగిరి బయలుదేరటానికి సిద్దమైనప్పటికీ పోలీసులు పవన్ ను అడ్డుకునే ప్రయత్నం చెయ్యడంతో అసహనం వ్యక్తం చేసిన ఆయన రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుతో జనసేనాని జాతీయ రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. పోలీసులు నచ చెప్పడంతో కొంత సమయం తర్వాత కారులోకి వెళ్లి కూర్చున్నారు. ఉన్నతాధికారుల నుండి ఆర్డర్స్ రావడంతో విజయవాడ వెళ్లేందుకు పవన్‌ కల్యాణ్‌కి అనుమతిచ్చిన పోలీసులు . అనుమంచిపల్లి నుంచి విజయవాడ వైపు కదిలిన పవన్‌ కల్యాణ్ కాన్వాయ్‌.