Page Loader
Pawan Kalyan: పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ 
Pawan Kalyan: పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2024
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని అయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల కోసంబీజేపీ , చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో తన పార్టీ సీట్ల భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేసిన కొద్ది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రకటన వెలువడింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా .. బీజేపీ 10 స్థానాల్లో, టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన పార్టీ చేసిన ట్వీట్