Andhra News: వేసవిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్.. కొనుగోలు వ్యయం తగ్గించేందుకు స్వాపింగ్ విధానం
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది గరిష్ట గ్రిడ్ డిమాండ్ 13,347 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ఫిబ్రవరి 4న నమోదైన 12,652 మెగావాట్లు అత్యధికంగా నమోదైన డిమాండ్.
అయితే,మార్చి,ఏప్రిల్ నెలల్లో దీని కంటే అధికంగా డిమాండ్ నమోదవుతుందని, కృత్రిమ మేధ (ఏఐ) విశ్లేషణ ఆధారంగా ఇంధన శాఖ అంచనా వేసింది.
విద్యుత్ సంస్థలు ఏఐ సాంకేతికతను ఉపయోగించి రాబోయే విద్యుత్ అవసరాలను 96-98% ఖచ్చితత్వంతో ముందుగా అంచనా వేయగలవని స్పష్టంగా తెలియజేశాయి.
ఈ అంచనాల ప్రకారం,వచ్చే ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకునే సమర్థ్యాన్ని అంచనా వేసి,వేసవి కాలంలో సమయాన్నిబట్టి డిమాండ్ తేడాలను నిర్ధారించాయి.
దీని ప్రకారం,అవసరమైన విద్యుత్‌ను ముందుగానే సమకూర్చుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాయి.
వివరాలు
25 ఏళ్ల డేటా ఆధారంగా విశ్లేషణ
గత 25 సంవత్సరాల వాతావరణ డేటా, సెలవులు, కోవిడ్ లాక్‌డౌన్ ప్రభావం, వాతావరణ సూచనలు, మరియు సీజనల్ సమాచారం ఆధారంగా విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసే మెరుగైన వ్యవస్థను అభివృద్ధి చేశారు.
దీని ద్వారా రేపటి విద్యుత్ వినియోగాన్ని టైం బ్లాక్‌ల వారీగా ముందే అంచనా వేయగల అవకాశముంది.
విద్యుత్ స్వాపింగ్ విధానం
కొన్ని ప్రత్యేక సమయాల్లో (15 నిమిషాల వ్యవధి = ఒక టైం బ్లాక్) విద్యుత్ సంస్థలు స్వాపింగ్ పవర్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించాయి.
స్వాపింగ్ అంటే ఇతర రాష్ట్రాల్లోని అదనపు విద్యుత్‌ను తాత్కాలికంగా వినియోగించుకుని, అవసరమైన సమయంలో తిరిగి అందించడం.
వివరాలు
పునరుత్పాదక విద్యుత్తుతో మిగులు ఉత్పత్తి
ఈ విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించుకోవడానికి ఉత్తరాది రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ను ఉదయం, సాయంత్రం అత్యధిక డిమాండ్ సమయంలో తీసుకునేందుకు విద్యుత్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి.
ప్రస్తుతం వివిధ వనరుల నుంచి అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి మొత్తం 21,728 మెగావాట్లు.
ఇందులో సుమారు 50% పునరుత్పాదక విద్యుత్ ద్వారా వస్తోంది.అయితే,వాతావరణ మార్పుల వల్ల పునరుత్పాదక విద్యుత్ నిరంతరాయంగా అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.
దీనివల్ల నిరంతర విద్యుత్ అవసరాలను తీర్చడం సవాలుగా మారింది.కొన్నిటైం బ్లాక్‌లలో మిగులు విద్యుత్ ఉంటున్నప్పటికీ, మార్కెట్ నుండి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది.
వేసవి కాలంలో,ముఖ్యంగా పగటి వేళల్లో, విద్యుత్ డిమాండ్‌కు మించి సరఫరా అందుబాటులో ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.