
జనసేనలోకి పంచకర్ల రమేష్ బాబు.. పెందుర్తి బరిలో దిగనున్న వైసీపీ మాజీ జిల్లా ప్రెసిడెంట్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు రాజీనామా ఇటీవలే రాజకీయ సంచలనానికి తెరలేపింది. ఈ మేరకు తాను జనసేన పార్టీలో చేరేందుకు కార్యచర్యణ సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జులై 17న చేరనున్నారు. అధికార పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణమాలకు మనస్తాపం చెందానని, ఫలితంగానే రాజీనామా సమర్పిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాల్లోకి ఎన్నో ఆశయాలు, ఆశలతో వచ్చానని, వాటిని నిలబెట్టుకునే పరిస్థితి లేకపోతే పదవిలో కొనసాగడం అర్థరహితమని భావించినట్లుగా పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలను వైసీపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని, అయినా పెద్దగా ప్రయోజనం లేదన్నారు.
DETAILS
రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా టిక్కెట్ హామీ ఇవ్వలేదు
వైసీపీకి రాజీనామా అనంతరం పెందుర్తి నియోజకవర్గంలో రమేశ్ బాబు అనుచరులతో సమావేశమయ్యారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వచ్చే ఎన్నికల్లో తనకు సీటు హామీ ఇవ్వలేదన్నారు.
ఈ సందర్బంగానే పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు రమేష్ రాజీనామాను తొందరపాటు చర్యగా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు.
ఏవైనా సమస్యలు ఉంటే తనతో చర్చిస్తే బాగుండేదన్నారు. సీఎంను కలిసే అవకాశం రాలేదనడం అబద్ధమన్న వైవీ, సీఎం విశాఖ వచ్చినప్పుడల్లా కలిసేలా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చానని తెలిపారు.
పార్టీలో ఆది నుంచి ఉన్నవారిని కాదని రమేష్ కు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామన్నారు. వారంలో అందరితో చర్చించి నూతన అధ్యక్షుడిని నియమిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.