తదుపరి వార్తా కథనం

Kolusu Parthasarathy: లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా పింఛన్లు పంపిణీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 05, 2025
04:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ సమాచారశాఖ మంత్రి పార్థసారథి పింఛను పంపిణీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పింఛన్లు అందించే బాధ్యత అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.
అమరావతిలో మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని, కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసిన విషయాన్ని కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు.
'రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. ప్రతి రైతూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ధాన్యం ఎలా ఉన్నా ప్రభుత్వం వాటిని కొనుగోలు చేస్తుంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని పార్థసారథి పేర్కొన్నారు.