LOADING...
AP Heavy Rains: ఏపీ ప్రజలు జాగ్రత్త..! రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తత తప్పనిసరి!
ఏపీ ప్రజలు జాగ్రత్త..! రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తత తప్పనిసరి!

AP Heavy Rains: ఏపీ ప్రజలు జాగ్రత్త..! రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తత తప్పనిసరి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మళ్లీ బీభత్సం సృష్టించనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకొని ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Details

సోమవారం (ఈ రోజు) 

అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అజాగ్రత్తగా ఉండకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అదే విధంగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, ఏలూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Details

 బుధవారం

పల్నాడు, అనంతపురం, తిరుపతి, కడప, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయి. జాగ్రత్తలతోనే ముందుకు సాగండి వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైనప్పుడు తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. పిడుగుల ప్రమాదం ఉన్నవేళ పాత భవనాల్లోకి వెళ్లకూడదని, చెట్లకింద నిలవకూడదని, అలాగే నదులు, కాలువలు, కల్వర్టుల దగ్గరికి వెళ్లరాదని స్పష్టం చేసింది. అలాంటి ప్రాంతాలు ముంపు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణ పరిణామాలపై అధికారుల సూచనలను పాటిస్తూ, వర్షాలు పడే సమయంలో ఎటువంటి ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.