తదుపరి వార్తా కథనం

Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై పిటిషన్.. సుప్రీంకోర్టు ఆగ్రహం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 05, 2025
04:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకుల భద్రతను కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ సందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు మండలించింది. సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మీరు ప్రయత్నించకూడదని సుప్రీంకోర్టు చివరిసారిగా చెప్పినట్లు పేర్కొంది.
కోర్టు పిటిషనర్‌ను ప్రశ్నిస్తూ 'మీ ఉద్దేశం ఏమిటి? మీరు ఈ పిటిషన్లు దాఖలు చేయమని ఎవరు ప్రోత్సహించారు?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పిటిషనర్ తన ఉద్దేశం పర్యాటకులకు మెరుగైన భద్రత కల్పించడమే అని చెప్పినా, కోర్టు అతని పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు అంగీకరించలేదు.
'మీరు ఈ సమస్య సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడం లేదు' అని కోర్టు అభిప్రాయపడింది. ఇటీవల మరొక పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టు దీనిని కూడా తోసిపుచ్చింది.