Phone Tapping: అత్యవసర పరిస్థితుల్లోనే ఫోన్ ట్యాపింగ్.. కేంద్రం కొత్త నిబంధనలు
ఐజీ లేదా ఆపై స్థాయి పోలీసు అధికారుల ఫోన్లను అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ చేయోచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ల శాఖ శుక్రవారం కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం, ట్యాపింగ్ ఆదేశాలు జారీ చేసిన అధికారి ఆగిన ఏడు పని దినాల్లో ఆ ఆదేశాలు నిజమైనవేనని నిర్ధారించకపోతే, ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని వాడకూడదని పేర్కొంది. ఈ సమాచారానికి సంబంధించిన పత్రాలను రెండు పనిదినాల్లో ధ్వంసం చేయాలని ఆదేశించింది.
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శితో సమీక్షించాలి
మరొక కీలక అంశం ప్రకారం, మారుమూల ప్రాంతాల్లో ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు జారీ చేయడం కష్టమైతే, ఆ అధికారి తరువాతి స్థానంలో ఉన్న అధికారి (ఐజీ ర్యాంకుకు తగ్గని వారు) ఆదేశాలు జారీ చేయవచ్చని పేర్కొంది. కేంద్రస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలను క్యాబినెట్ కార్యదర్శి, న్యాయశాఖ, టెలికాం శాఖల కార్యదర్శులతో కూడిన కమిటీ సమీక్షిస్తే, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శి, న్యాయ, హోంశాఖల కార్యదర్శులతో కూడిన కమిటీ సమీక్షించాలని సూచించింది.