Page Loader
మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్ 
మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్

మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్ 

వ్రాసిన వారు Stalin
Sep 26, 2023
10:27 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే. తాజాగా వారు శవాలై కనిపించారు. వీరిద్దరి మృతదేహాలకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే వీరు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఇద్దరూ మెయిటీ కమ్యూనిటీకి చెందిన హిజామ్ లింతోఇంకాంబి అనే అమ్మాయి, ఫిజామ్ హేమ్‌జిత్ అనే అబ్బాయి. వారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు సమాచారం. చనిపోయిన బాలిక వయసు 17 ఏళ్లు కాగా, యువకుడి వయసు 20 ఏళ్లు. మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించిన రోజే విద్యార్థుల చనిపోయిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేపట్టనుంది. అయితే మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు.

మణిపూర్

మృతదేహాల వెనుక తుపాకులతో ఇద్దరు సాయుధులు

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటోల్లో విద్యార్థులిద్దరి మృతదేహాలు నేలపై పడి ఉన్నాయి. ఇందులో బాలుడి తల తెగిపోయింది. వైరల్ అవుతున్న ఫొటోల్లో ఇద్దరు తుపాలకు సాయుధలైన వారు వారి వెనక ఉన్నట్లు కనిపించింది. వారు కనిపించకుండా పోయినప్పుడు లిన్‌థోఇంకాంబి తెల్లటి టీషర్ట్‌, హేమ్‌జిత్‌ చెక్‌ టీషర్ట్‌ ధరించి ఉన్నారు. అదే సమయంలో ఈ ఘటన పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ కేసును చేధించడానికి పోలీసులు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సైబర్‌సెల్ సహాయంతో చిత్రంలో వారి వెనుక కనిపించిన సాయుధ వ్యక్తులను కనుగొనడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.