LOADING...
Air China: విమానం గాల్లో ఉండగా మంటలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
విమానం గాల్లో ఉండగా మంటలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Air China: విమానం గాల్లో ఉండగా మంటలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలోని హాంగ్‌జౌ నుంచి సియోల్ సమీపంలోని ఇంచియాన్ వరకు బయల్దేరిన ఎయిర్ చైనా(Air China) విమానంలో గాల్లో ఉన్న సమయంలో ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగిన ఘటన సంభవించింది. ఈ మంటల కారణం లగేజీలోని లిథియం బ్యాటరీ పేలడంగా గుర్తించారు. విమానం గాల్లోకి ఎక్కిన కొద్దిసేపటి తరువాత ఓవర్‌హెడ్ బిన్ నుండి మంటలు బయటకు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది షాంఘై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేపట్టి,పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని ఎయిర్ చైనా అధికారులు స్పష్టం చేశారు. అయితే ఓ ప్రయాణికుడు ఈఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వెంటనే వైరల్ అయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియో