LOADING...
Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు
శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు

Chandrababu: శ్రీసిటిలో 220 పరిశ్రమ ఏర్పాటుకు ప్రణాళికలు : సీఎం చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 19, 2024
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీసిటిలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక వేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పెట్టుబడులు తెచ్చేందుకు పలు దేశాల్లో పర్యటించానని, భారత్‌ను ఐటీ, ప్రపంచపటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉన్నారని, ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉండడం గర్వకారణమన్నారు.

Details

ఎకనామిక్ జోన్ గా మార్చేందుకు కృషి

ప్రస్తుతం శ్రీసిటిలో 8వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఉండగా, తాజాగా సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్‌లు వచ్చాయి. ఇక ఈ ప్రాంతంలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉందని, ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం గొప్ప విషయమన్నారు. శ్రీ సిటిని అత్యుత్తమ ఎకనామిక్ జోన్‌గా తయారు చేయాలనేది తన లక్ష్యమన్నారు.

Details

2029 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

శ్రీసిటికి అన్ని రకాల మౌలిక వసతులు ఉన్నాయి, అయితే నివాసయోగ్య ప్రాంతంగా మార్చడానికి కృషి చేస్తాం. ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించుకొనే విధంగా ప్రభుత్వం చర్యలను చేపడుతుంది. ఇదిలా ఉండగా రాజధాని కోసం 29వేల మంది రైతులు 34వేల ఎకరాల భూమి ఇచ్చారని, ప్రస్తుతం ఇంటింటికి తాగునీరు, విద్యుత్, ఫైబర్ నెట్ అందిస్తామన్నారు. 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు.