NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ 
    ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ

    PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2025
    10:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) మీడియాతో మాట్లాడారు.

    ''మహాలక్ష్మి మనకు సిద్ధి,బుద్ధిని అందిస్తుంది.పేదలు,సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.భారతదేశం శక్తి, సామర్థ్యాలు మనకు గొప్ప గుర్తింపు,సార్ధకతను అందిస్తాయి.మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాని ప్రజలు ఆశీర్వదించారు.మూడోసారి పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నాము.ఈ వార్షిక బడ్జెట్ ప్రజల్లో కొత్త నమ్మకాన్నినింపుతుంది. భారత్ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్‌లో ముందుకు సాగుతుంది.ఇన్నోవేషన్,ఇన్‌క్లూజన్, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యంతో దూసుకెళ్లిపోతుంది.కొత్త విధానాలు మన ఆర్థిక ప్రగతికి పునాదిగా ఉంటాయి. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాము.పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది,ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను'' అని ప్రధాని మోదీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

    వివరాలు 

    వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ 

    ఈ బడ్జెట్ సమావేశాలలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టనున్నారు.

    శనివారం కేంద్ర బడ్జెట్‌ను ఆమె సభకు సమర్పించనున్నారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్నాయి.

    తొలివిడత ఫిబ్రవరి 13వ తేదీ వరకు, రెండోవిడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్
    UAE Golden Visa: UAE గోల్డెన్ వీసా అంటే ఏమిటి? భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

    నరేంద్ర మోదీ

    Narendra Modi: కువైట్‌ పర్యటనకు ప్రధాని మోదీ.. 43 ఏళ్ళ తర్వాత తొలిసారిగా..  కువైట్
    Rahul Gandi: దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతకు మోదీ ప్రభుత్వ చర్యలే కారణం  రాహుల్ గాంధీ
    PM Modi: 'కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తోంది'..అంబేద్కర్ వివాదంపై మోదీ స్పందన అమిత్ షా
     PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు రవిచంద్రన్ అశ్విన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025