PM Modi- Chandrababu: మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ - ఏఏ అంశాలపై చర్చించుకున్నారంటే?
ఈ వార్తాకథనం ఏంటి
PM Modi and Chandrababu met: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఈ ఇద్దరి సమావేశం జరిగింది.
ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది.
ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా. రాష్ట్రానికి ఆర్థికసాయం సహా ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారని తెలిసింది.
పోలవరం, అమరావతి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం.
చంద్రబాబు
అమిత్‌షాతో భేటీ
అంతకుముందు రాష్ట్రానికి చెందిన ఎన్డీయే ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కూడా చంద్రబాబు కలిశారు.
ఆయనతోనూ వివిధ అంశాలపై బాబు మాట్లాడారు. ఇకపోతే మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీతో సీఎం భేటీ అవుతారు.
సాయంత్రం కేంద్రమంత్రులు హర్దీప్ సింగ్ పురీ, మనోహర్ లాల్ ఖట్టర్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.
ఇంకా ఈ భేటీలో అమరావతి ఎక్స్‌ప్రెస్ వే, రహదారుల మరమ్మతులు, జల్‌జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు. పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేయనున్నట్లు తెలిసింది.